లఖింపూర్ ఖేరీ హింస కేసు: ఆశిష్ మిశ్రా విడుదల

లఖింపూర్ ఖేరీ హింస కేసు: ఆశిష్ మిశ్రా విడుదల

లఖింపూర్ ఖేరీ హింస కేసులో ప్రధాన నిందితుడు అజయ్ మిశ్రాకు బెయిల్ దొరికిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక కేసుకు సంబంధించి  ఆశిష్ బెయిల్‌పై విడుదలై జైలు నుంచి బయటకు వచ్చారు. అలహాబాద్‌ హైకోర్టు ఆయనకు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ రోజునే ఆశిష్ మిశ్రాకు కోర్టు బెయిల్‌ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకున్నది. 

గత ఏడాది అక్టోబర్‌ 3న లఖింపూర్‌ ఖేరిలో రోడ్డు పక్కన నిరసన చేస్తున్న రైతులను, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు, ఆశిష్‌ మిశ్రా తన కాన్వాయ్‌లోని కారుతో తొక్కించాడు. దీంతో హింస రాజుకున్నది. నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్‌, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, వాహనం డ్రైవర్‌ మరణించారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. రైతు సంఘాలు దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. 

మరోవైపు లఖింపూర్‌ ఖేరి హింసాత్మక ఘటనపై సుప్రీం కోర్టు  సైతం జోక్యం చేసుకుంది. యూపీలోని అధికార బీజేపీ ప్రభుత్వానికి, పోలీసులకు చీవాట్లు పెట్టింది. దీంతో ఈ హింసాత్మక ఘటనపై దర్యాప్తు కోసం సిట్‌ను నియమించారు. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్‌ 9న ఆశిష్‌ మిశ్రాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ చార్జిషీట్‌ను సిట్‌ దాఖలు చేసింది. దీంతో అరెస్టైన నాలుగు నెలల తర్వాత ఆశిష్ మిశ్రాకు కోర్టులో బెయిల్‌ లభించింది.

ఇవి కూడా చదవండి:

జగన్‌తో సమావేశానికి నేను రానన్నా

ఏపీ,తెలంగాణలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చెస్తం