లఖింపూర్ ఖేరీలో హింసతో తనకు, తన కొడుక్కి ఎలాంటి సంబంధం లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా. తాను కానీ... తన కొడుకు కానీ అక్కడ లేమనడానికి ఆధారాలున్నాయని చెప్పారు. కుట్ర చేసినవారిని వదిలిపెట్టేదిలేదన్నారు. తన కొడుకు గానీ అక్కడ ఉండి ఉంటే కచ్చితంగా చనిపోయేవాడన్నారు. తన కొడుక్కి వ్యతిరేకంగా ఒక్క ఆధారం చూపినా... మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
