హైదరాబాద్ మార్కెట్లోకి ఐశ్వర్య బియ్యం

ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన బియ్యాన్ని అందించే లక్ష్యంతో శ్రీ ఐశ్వర్య సంస్థ హైదరాబాద్ మార్కెట్లోకి మూడు రకాల బియ్యం ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది.  సోమాజిగూడ లోని పార్క్ హోటల్ లో  సంస్థ బ్రాండ్ అంబాసిడర్ యాంకర్ సుమ ఉత్పత్తులను సంస్థ ఎండి శ్రీధర్ ఎస్ బిఐ ఏజీఎం శ్రీనివాస్ రాఘవన్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలకు ప్రధాన ఆహారమైన అన్నంను  ఆరోగ్యకరంగా అందించడం లక్ష్యంగా తమ ఉత్పత్తులను తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇందులో బాలింత బియ్యం శిశువుకు జన్మనిచ్చిన మాతృమూర్తికి పూర్తి ఆరోగ్యాన్నిచ్చే బియ్యమని చెప్పారు. 

18 నెలల పాటు నిల్వ ఉంచి ప్రత్యేక ప్రార్సింగ్ ద్వారా ఈ బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు శ్రీనివాస్ రాఘవన్ చెప్పారు. షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో షుగర్ నియంత్రించడంతో పాటు భవిష్యత్తులో షుగర్ బారిన పడకుండా ఉండేందుకు లో గ్లైసమిక్ ఇండెక్స్ (జిఐ) బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. 

ALSO READ |  ఇవి తింటేనే సరైన ఆరోగ్యం..!

పెళ్లిళ్లతో పాటు పలు  రకాల శుభకార్యుల కోసం ప్రత్యేక బియ్యాన్ని మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నామని చెప్పారు. ఈ మూడు రకాల ఉత్పత్తులు వ్యాపార దూరంతో కాకుండా ప్రజలకు మంచి ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో తీసుకొచ్చామని శ్రీధర్ చెప్పారు. త్వరలోనే భారీ షాపింగ్ మాల్స్ తో పాటు అన్ని రకాల షాపులలో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఈ కామర్స్ వెబ్సైట్లో ద్వారా కూడా తమ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చునని తెలిపారు.