ఎయిర్ టెల్ సేవలకు అంతరాయం.. పునరుద్ధరణ

ఎయిర్ టెల్ సేవలకు అంతరాయం.. పునరుద్ధరణ
  • ఎయిర్ టెల్ ఇంటర్నెట్ పని చేస్తున్నప్పటికీ, వాయిస్ కాల్స్ కు అంతరాయం
  • యథావిధిగా వాట్సప్ వాయిస్ కాల్స్, ఇతర సేవలు
  • దాదాపు 30 నిమిషాల నుండి వాయిస్ కాల్స్ నిలిచిపోయినట్టు సమాచారం

దేశంలోని అనేక ప్రాంతాలలో ఎయిర్ టెల్ సేవలకు అంతరాయం కలిగింది. ఈ నేపథ్యంలో వినియోగదారులు ట్విట్టర్ వేదికగా కంప్లైంట్ చేస్తూ యూజర్స్ ట్వీట్ చేశారు. చాలా మంది ఎయిర్ టెల్ డౌన్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఎయిర్ టెల్ టెలికాం సేవలతో పాటు, డీటీహెచ్, ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ సేవల్లోనూ ఈ లోపం తలెత్తినట్టు తెలుస్తోంది. అయితే కొందరికి ఇంటర్నెట్ పని చేస్తున్నా.. కాల్స్ మాత్రం వెళ్లట్లేదనే ఫిర్యాదులూ వచ్చాయి. దాదాపు 30 నిమిషాల పాటు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగింది. అనంతరం యథావిధిగా సేవలు పునరుద్ధరించబడ్డాయి.