ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంక్​

ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంక్​
  • లిస్టింగ్​ ప్లాన్

న్యూఢిల్లీ: లాభాలతో నడుస్తున్న ఎయిర్​టెల్​ పేమెంట్​బ్యాంక్​ను లిస్టింగ్​కు తీసుకెళ్లాలని భారతి ఎయిర్​టెల్​ ప్లాన్​ చేస్తోంది. ఈ పేమెంట్​ బ్యాంక్​ ఏటా రెండంకెల గ్రోత్​ సాధిస్తున్నట్లు కంపెనీ సీనియర్​ ఆఫీసర్​ ఒకరు చెప్పారు. భవిష్యత్తులో డేటా సెంటర్​ బిజినెస్​నూ మానిటైజ్​ చేసే ఛాన్స్​ ఉందన్నారు.  5 జీ సేవలకు ప్రీమియం రేట్లు వసూలు చేసే ఆలోచన ఎయిర్​టెల్​కు లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని మొబైల్​ డివైస్​లలో 12 శాతం మాత్రమే ప్రస్తుతం 5జీ ని సపోర్ట్​  చేస్తాయని చెప్పారు. 

అప్పులలో కూరుకుపోయిన టెలికం ఇండస్ట్రీకి టారిఫ్​లు పెంచడం అనివార్యమని అభిప్రాయపడ్డారు. రెండు సర్కిల్స్​లో బేస్​ రేట్లను పెంచడం అంచనా వేసిన దానికంటే బెటర్​ రిజల్ట్స్​ ఇస్తోందని పేర్కొన్నారు. ఇతర సర్కిల్స్​లోనూ బేస్​ రేట్లను పెంచడంపై ఆరు వారాలలో  ఎయిర్​టెల్​ నిర్ణయం తీసుకుంటుందని ఆ సీనియర్​ ఆఫీసర్​ చెప్పారు. పోటీ కంపెనీలు ఏం చేస్తాయో చూసి, ఎయిర్​టెల్​ తన నిర్ణయం ప్రకటించాలని భావిస్తోంది.