గన్ మిస్ ఫైర్… ఎయిర్ ఫోర్స్ ఆంధ్ర జవాన్ మృతి

గన్ మిస్ ఫైర్… ఎయిర్ ఫోర్స్ ఆంధ్ర జవాన్ మృతి

ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నానికి చెందిన భారత ఎయిర్ ఫోర్స్ జవాన్ పి.లావణ్య ప్రకాష్ (23)  ప్రమాదవశాత్తు గన్ మిస్ ఫైర్ అయి ప్రాణాలు కోల్పోయారు. విషాద వార్త తెలియడంతో తల్లిదండ్రులు, బంధువులు,స్నేహితులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. నాలుగేళ్ల ఏళ్ల కింద ఎయిర్ ఫోర్స్ లో మెకానికల్ ఇంజినీరుగా చేరారు లావణ్య ప్రకాష్. రెండున్నరేళ్లుగా శిక్షణ తర్వాత.. రాజస్థాన్ లో ఉద్యోగం చేస్తున్నారు లావణ్య ప్రకాష్.

ఉద్యోగ విధులలో భాగంగా గన్ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు అది పేలడంతో… లావణ్య ప్రకాశ్ శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అక్కడికక్కడే జవాన్ మృతి చెందాడు.

కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి ఎయిర్ ఫోర్స్ సిబ్బంది.. లావణ్య ప్రకాష్ పార్థివదేెహాన్ని ఈ ఉదయం తీసుకొచ్చారు.గన్నవరం విమానాశ్రయం నుండి మచిలీపట్నం పంపులచెరువులోని సొంత ఇంటికి అతడి పార్ధివదేహాన్ని బంధువులు,ఎయిర్ ఫోర్స్ అధికారులు తీసుకెళ్లారు.