యాంటీ ఇండియా బ్యానర్‌‌ కలకలం

యాంటీ ఇండియా బ్యానర్‌‌ కలకలం

రాజకీయ, దేశ వ్యతిరేక నినాదాలకు వరల్డ్‌‌కప్‌‌ వేదిక అవుతోంది.  శ్రీలంక–టీమిండియా మ్యాచ్‌‌ సందర్భంగా హెడింగ్లే స్టేడియం మీదుగా వెళ్లిన గుర్తు తెలియని రెండు ఎయిర్‌‌క్రాఫ్ట్స్‌‌ యాంటీ ఇండియా బ్యానర్లను ప్రదర్శించడం కలకలం రేపింది.  ఆట మొదలైన కొద్ది నిమిషాలకే  ‘జస్టిస్‌‌ ఫర్‌‌ కశ్మీర్‌‌’ అని  రాసున్న  బ్యానర్‌‌తో ఓ ఎయిర్‌‌క్రాఫ్ట్‌‌  గ్రౌండ్‌‌పై నుంచి వెళ్లింది. అరగంట తర్వాత ‘ఇండియా మారణహోమాన్ని ఆపి, కశ్మీర్‌‌కు విముక్తి కలిగించు’ అనే బ్యానర్‌‌తో మరో ఎయిర్‌‌క్రాఫ్ట్‌‌ ప్రయాణించింది. వరల్డ్‌‌కప్‌‌లో  ఇదే మైదానంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. గత నెల 29వ తేదీన అఫ్గానిస్థాన్‌‌–పాకిస్థాన్‌‌ మ్యాచ్‌‌ సందర్భంగా ‘జస్టిప్‌‌ ఫర్‌‌ బలూచిస్థాన్‌‌’ బ్యానర్‌‌ను ప్రదర్శించిన ఓ ఎయిర్‌‌క్రాఫ్ట్‌‌  కొద్ది దూరంలోని  బ్రాడ్‌‌ఫోర్డ్‌‌ ఎయిర్‌‌పోర్ట్‌‌లో ల్యాండైంది.  ఒకే  స్టేడియంలో  రెండు ఘటనలు జరగడంతో  టోర్నీ భద్రత గురించి ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనిపై ఐసీసీ సీరియస్‌‌గా వ్యవహరించకుంటే నిరసనలు, నినాదాలకే కాకుండా ఆటగాళ్లు, అభిమానుల భద్రతకు కూడా ముప్పు వాటిల్లే  ప్రమాదం ఉంది.