ఎయిర్​క్వాలిటీ లైఫ్​ఇండెక్స్–2024: భారత్ లో వాయు కాలుష్యం 19శాతం తగ్గింది

2021–22 మధ్యకాలంలో ప్రపంచంలో బంగ్లాదేశ్​ తర్వాత భారత్​లోనే వాయు కాలుష్యం భారీ స్థాయిలో 19.3 శాతం అధికంగా తగ్గిందని, దీంతో భారతీయుల సగటు ఆయుర్ధాయం ఏడాదిపాటు పెరిగిందని చికాగో యూనివర్సిటీలోని ఎనర్జీ పాలసీ ఇన్​స్టిట్యూట్​ (ఈపీఐసీ) విడుదల చేసిన ఎయిర్​ క్వాలిటీ లైఫ్​ ఇండెక్స్​–2024 నివేదికలో వెల్లడించింది. 

భారత్​లోని అత్యంత కలుషితమైన ఉత్తర మైదానాల్లో 2021తో పోలిస్తే 2022లో 17.2 శాతం కాలుష్య తగ్గుదల నమోదైనప్పటికీ 540.7 మిలియన్ల ప్రజలు నివసించే ఉత్తర మైదానాలు డబ్ల్యూహెచ్​ఓ ప్రమాణాలతో పోలిస్తే ఆయుర్ధాయం 5.4 సంవత్సరాలు తగ్గడం విచారకరం. అయితే ధూళి కణాల కాలుష్యం స్థాయిల క్షీణత ఇలాగే కొనసాగితే రాబోయే సంవత్సరాల్లో ఇక్కడి వారి ఆయుర్ధాయం 1.2 సంవత్సరాలు పెరుగుతుంది. 

Also Read :- జపాన్​యానిమేటర్కు రామన్ మెగసెసె అవార్డ్స్​ 2024

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​లు అత్యధిక కాలుష్య భారాలు మోస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో నివసిస్తున్న వారు 2.9 సంవత్సరాల ఆయుష్షును కోల్పోతున్నారు. 

  పశ్చిమబెంగాల్​లోని పురూలియా, బంకురా జిల్లాల్లో కాలుష్య తీవ్రత గణనీయంగా తగ్గింది. కాలుష్యం తగ్గుముఖం పట్టినా 42.6 శాతం మంది ప్రజలు జాతీయ వాయు నాణ్యత ప్రమాణమైన క్యూబిక్​ మీటర్ కు 40 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు.