ఎయిరిండియా ఉద్యోగుల‌కు షాక్ ..పైలట్ల వేత‌నంలో కోత‌

ఎయిరిండియా ఉద్యోగుల‌కు షాక్ ..పైలట్ల వేత‌నంలో కోత‌

క‌రోనా సంక్షోభం నేప‌థ్యంలో పైల‌ట్లకు ఇచ్చే వేత‌నాన్ని 40 శాతం త‌గ్గిస్తున్న‌ట్లు ఎయిరిండియా ప్ర‌క‌టించింది. ఈ నిబంధ‌న‌లు ఏప్రిల్ 1 నుంచి అమ‌లు కానున్నాయ‌ని తెలిపింది. దీంతో పాటు ఇతర అలవెన్సులు కలుపుకొని 85 శాతం వరకు నష్ట పోతున్నట్లు పైలట్లు వాపోతున్నారు. కాగా విమానయాన మంత్రిత్వ శాఖ నిర్దేశాల మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఎయిరిండియా పేర్కొంది. రూ.25 వేల గ్రాస్ శాలరీ ఉన్న ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తించదని స్పష్టం చేసింది. అయితే ఎయిరిండియా నిర్ణ‌యంతో తాము గ్రాస్ శాలరీలో తేడా వల్ల భారీగా నష్ట పోతున్నామని.. తమకు న్యాయం చేయాలని పైలట్లు కోరుతున్నారు.