ఎయిర్‌ ఇండియా ఆఫర్‌.. టికెట్‌ ధరలో 50% డిస్కౌంట్

ఎయిర్‌ ఇండియా ఆఫర్‌.. టికెట్‌ ధరలో 50% డిస్కౌంట్

న్యూ ఢీల్లీ : విమాన‌యాన సంస్థ ఎయిర్ ఇండియా వృద్ధులకు, సీనియర్‌ సిటిజన్లకు ఓ బంపర్ ఆఫర్ అందించనుంది. 60 ఏళ్ల వయసు దాటిన వారికి టిక్కెట్ల కొనుగోలులో 50% డిస్కౌంట్ శాతం ఇస్తోంది.ఎకానమీ క్లాస్‌కు మాత్రమే ఇది వర్తించనుంది. ఎయిర్ ఇండియా సంస్థ అధికారిక వెబ్ సైట్ ప్రకారం ప్ర‌స్తుత టికెట్ ధరలో 50% డిస్కౌంట్ తో విమాన ప్రయాణాలు చేయవచ్చు. ఈ ఆఫర్ భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా టికెట్‌ను బుక్‌ చేసుకోవచ్చు. టికెట్ జారీ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం వరకు చెల్లుతుంది.

దీని కోసం కొన్ని షరతులు కూడా విధించారు. ఈ పథకాన్ని పొందగోరే వ్యక్తులు తప్పనిసరిగా భారతీయ పౌరులై, అలాగే 60 సంవత్సరాలు నిండి ఉండాలి. వోటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్ లేదా త‌మ వ‌య‌స్సుని నిర్దారించే ఏ ఇత‌ర ఐడీ కార్డు అయినా ఉండాలి. ప్రయాణం రోజుకు కనీసం 7 రోజుల ముందు టికెట్ బుకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర విమానయాన శాఖ పేర్కొన్నది. 2 ఏళ్ల వయసులోని పిల్లలకు సైతం టికెట్‌ ధరలో తగ్గింపు అమలుకానున్నట్లు ఎయిర్‌ ఇండియ వర్గాలు వెల్లడించాయి. అయితే వారి పిల్లలలో ఒక్కరికీ మాత్రమే తగ్గింపు ఉంటుంది. అదికూడా రూ. 1,250 కూపన్‌, పన్నులు వర్తిస్తాయని తెలియజేశాయి. ఎయిర్‌ ఇండియా నిర్వాహక విమానాలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నాయి.