ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: విజయవాడ - ముంబై మధ్య ఎయిర్ ఇండియా డైలీ ఫ్లైట్

–ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం పాలన పరంగా ప్రక్షాళన దిశగా అడుగులేస్తోంది. సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్షలు నిర్వహిస్తుండగా కొత్తగా ఏర్పడ్డ మంత్రివర్గం బాధ్యతల స్వీకరణలో బిజీ అయ్యింది. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ, ముంబై మధ్య డైలీ ఫ్లైట్ సర్వీస్ పారరంబించనున్నట్లు తెలిపింది ఎయిర్ ఇండియా సంస్థ. ఈ సర్వీస్ వెనక మచిలీపట్టణం ఎంపీ బాలశౌరి చొరవ కారణమని తెలుస్తోంది.

ఎంపీ బాలశౌరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఛైర్మెన్ గా ఉన్న సమయంలో వియజయవాడ ముంబై మధ్య సర్వీస్ ప్రారంభించాలని సంబంధిత శాఖ మంత్రులు, అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ముంబై మధ్య ఎయిర్ ఇండియా డైలీ ఫ్లైట్ శనివారం నుండి ప్రారంభం కానుంది.

దీంతో విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు పట్టణ పరిసర ప్రాంతాల్లోని వ్యాపారులకు ఇతర అవసరాల నిమిత్తం విజయవాడ నుంచి ముంబైకి, ముంబయి నుంచి విజయవాడ వచ్చేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఈ ఫ్లైట్ 15వ తేదీ శనివారం సాయంత్రం 5గంటల 45నిమిషాలకు ముంబై నుండి విజయవాడకు వస్తుంది. తిరిగి 7.10 గంటలకు విజయవాడ నుంచి ముంబైకి అదే విమానం వెళ్లనుంది.ఈ సర్వీసు ఏర్పాటు కావడం వల్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.