న్యూఢిల్లీ: కొత్తగా మార్కెట్‌లోకి వచ్చే అన్ని కార్ల మోడల్స్‌లోని ఫ్రంట్ సీట్లలో ఎయిర్ బ్యాగ్‌లు తప్పనిసరి కానున్నాయి. ఈ మేరకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు రోడ్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్ట్రీ తెలిపింది. ఇప్పటికే ఉన్న వెహికిల్స్‌లోని ఫ్రంట్ సీట్స్‌లో ఎయిర్ బ్యాగ్‌లను ఏర్పాటు చేసేందుకు జూన్ 1ని గడువుగా విధించారు. మోడల్స్, ధరతో సంబంధం లేకుండా అన్ని రకాల కార్లలో దీన్ని తప్పక అమలు చేయాల్సిందేనని మినిస్ట్రీ పేర్కొంది. ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గబోదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. డ్రైవర్లకు ఎయిర్ బ్యాగ్ ఉండాలనే నియమాన్ని 2019, జూలై 1న కేంద్రం ప్రవేశపెట్టింది. డ్రైవర్‌తోపాటు పక్క సీటులో కూర్చునే ప్రయాణికుడి భద్రతను కూడా దృష్టిలో ఉంచుకొని మరో ఎయిర్ బ్యాగ్‌ను ఏర్పాటు చేయాలని తాజాగా కేంద్రం కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది.
