వర్ధన్నపేట(ఐనవోలు), వెలుగు : ఐనవోలు మల్లికార్జున స్వామికి సుధావలి వర్ణ లేపనం (రంగులు అద్దడం) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు ఉంటుందని స్వామివారి దర్శనం, అర్జిత సేవలు నిలిపివేస్తున్నామని దేవాలయ కార్యనిర్వహణాధికారి అద్దంకి నాగేశ్వర్రావు, ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్
ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధూకర్శర్మ తెలిపారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు. 16వ తేదీన దృష్టి కుంభంతో స్వామి వారి సేవలు ప్రారంభమవుతాయని చెప్పారు.