Good News : యోగా వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.. ఎయిమ్స్ పరిశోధనల్లో వెల్లడి

కాసేపు కుర్చీలో కూర్చుని మళ్లీ లేవాలంటే కష్టంగా ఉంటుంది. కొంచెం దూరం నడవాలన్నా నరకంగా ఉంటుంది. కీళ్లన్నీ బిగుసుకుపోయి ఉంటాయి. ఈ సమస్యనే ఆర్థరైటిస్‌ అంటారు. ఆర్థరైటిస్‌ అంటే ఎముకలు, వాటి కణజాలాలకు సంబంధించిన సమస్య. అర్థరైటిస్‌లో 200 రకాల కంటే ఎక్కువే ఉంటాయి. అయితే ఇందులో ఆస్టియోఆర్థరైటిస్, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్, యాంకైలోజింగ్‌ స్పాండైల్‌ ఆర్థరైటిస్, గౌట్, జువెనైల్‌ ఇడియోఫథిక్‌ ఆర్థరైటిస్‌ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కీళ్ల దగ్గర నొప్పి, వాపు, కీళ్లు స్టిఫ్‌గా మారడం.. వీటన్నింటిలో కనిపించే సాధారణ లక్షణం. చలికాలంలో.. అర్థరైటిస్‌ నొప్పి తీవ్రంగా ఉంటుంది. అయితే ఇలాంటి నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఢిల్లీ AIIMS అధ్యయనం చేసి.. ఓ నివేదిక వెల్లడించింది.  

 ఆర్థరైటిస్ అనేది కీళ్ల నొప్పులను కలిగించే ఒక సమస్య. ఇందులో వందకు మించిన రకాలు ఉన్నాయి. చాలా రకాల ఆర్థరైటిస్‌లు చురుకైన రోగనిరోధక వ్యవస్థ దాని స్వంత కణజాలంపైనే దాడి చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో మంట, నొప్పి అలాగే వాపు ఉంటుంది. కీళ్ల మధ్యలో మృదులాస్థి అరిగిపోవడం వలన కీళ్ల నొప్పులు, కదపలేకుండా గట్టిపడటం, వాపు మొదలైన సాధారణ లక్షణాలు కనబరుస్తుంది. అయితే అన్ని రకాల ఆర్థరైటిస్ నొప్పులకు యోగాలోని వివిధ ఆసనాలు ప్రభావవంతమైన పనితీరును కనబరుస్తాయని ఢిల్లీ ఎయిమ్స్​ ఓ నివేదిక ద్వారా తెలిపింది. 

ALSO READ | Good Health : ఈ మాత్రం రన్నింగ్ చేస్తే.. రోజంతా ఉల్లాసం.. ఉత్సాహం

రుమటాయిడ్​ ఆర్థరైటిస్ తో బాధ పడుతున్న వారు  యోగా చేయడం వలన చాలా ప్రయోజనాలున్నాయని ఎయిమ్స్​ ప్రకటించింది. సెల్యులార్​. .. మాలిక్యులర్ బోన్స్​ బలవంతంగా ఉండేందుకు యోగా ఉపయోగపడుతుందని  న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)  తెలిపింది. రుమటాయిడ్​ ఆర్థరైటిస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి.  ఇది కీళ్లలో మంట, నొప్పిని కలుగజేస్తుంది.  ఆర్థరైటిస్​ తో బాధపడేవారు గుండె, మెడడు, ఊపిరితిత్తులు వంటివి కూడా ప్రభావితం చేస్తాయి,  యోగా చేయడం వలన మానసిక ప్రశాంతతే కాకుండా ఇలాంటి వ్యాధులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని AIIMS ప్రకటించింది.  అనాటమీ డిపార్ట్‌మెంట్ .. AIIMS లోని రుమటాలజీ విభాగం..DST సాయంతో  మాలిక్యులర్ రీప్రొడక్షన్ అండ్ జెనెటిక్స్, రుమటాయిడ్​ ఆర్థరైటిస్ తో బాధపడేవారిలో  సెల్యులార్, మాలిక్యులర్  స్థాయిలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో AIIMS బృందం పరిశీలించింది. యోగాచేస్తే కీళ్ల నొప్పులు తగ్గడమే కాకుండా.. చాలా రకాల ప్రయోజనాలున్నాయని అనేక పరిశోధనల ద్వారా తెలిసిందని ఆ బృందం తెలిపింది. 

యోగాసనాలు వేయడం వలన కణాలు బలపడటమే.. వాపు , నొప్పిని నియంత్రిస్తుంది. ఇంకా  శరీరంలోని ఒత్తిడి తగ్గించడంతో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ సైటోకిన్‌లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.  వ్యాధినిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుందని AIIMS  నివేదికలో పేర్కొంది. ఎండార్ఫిన్ స్థాయిలను పెంచి... కార్టిసాల్ ..  CRP స్థాయిలను తగ్గిస్తుంది.  అర్థరైటిస్‌ పేషెంట్స్‌ ప్రతి రోజూ ప్రాణాయామం, ధ్యానం, 30 నిమిషాల పాటు తేలికపాటి యోగాసనాలు వేస్తే.. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించవచ్చని పరిశోధకులు తెలిపారు.