రిజర్వాయర్ల నిర్మాణంతో రైతులకు మేలు : సంపత్ కుమార్

శాంతినగర్, వెలుగు: మల్లమ్మ కుంట, వల్లూరు, జులకల్లు రిజర్వాయర్ల నిర్మాణంతో ఆర్డీఎస్ రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఏఐసీసీసెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని మల్లమ్మ కుంటను గురువారం ఆయన పరిశీలించారు. 

అధికారులు వెంటనే  మల్లమ్మ కుంట రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు. అనంతరం భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. రిజర్వాయర్ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి అధిక ప్రయోజనాలు ఉంటాయన్నారు.