తెలంగాణలో కాంగ్రెస్ కు ఎదురు లేదు : సంపత్ కుమార్

గద్వాల, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్  పార్టీకి ఎదురులేదని, ఏ ఎన్నికలు వచ్చినా ఘన విజయం సాధించడం ఖాయమని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్  తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో  ‘రేవంతన్న దండుగా ప్రజాపాలనకు అండగా’ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్  చౌరస్తా నుంచి జములమ్మ గుడి వరకు పాదయాత్ర నిర్వహించారు. అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పాదయాత్ర స్టార్ట్  చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్  ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జడ్పీ చైర్​పర్సన్  సరిత, తిరుపతయ్య, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్  బండారి భాస్కర్, శంకర్, ఇసాక్, నర్సింలు, నాగేందర్ యాదవ్  ఉన్నారు.