అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

అలంపూర్ /శాంతినగర్ వెలుగు : అక్రమంగా మట్టి తవ్వుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ డిమాండ్​ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్ర సమీపంలో భారత్ మాల రోడ్డు నిర్మాణం ప్రాజెక్ట్ పనుల పేరుతో కాంట్రాక్టర్లు అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నారని అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

శనివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి గట్టుపై తవ్వకాల ప్రాంతాన్ని పరిశీలించారు. మట్టి తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  08SHN01: టిప్పర్లను అడ్డుకున్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్.