అక్రమ దందాలే తప్ప అభివృద్ధి జరగలే : సంపత్ కుమార్

శాంతినగర్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్  పాలనలో అక్రమ దందాలే తప్ప, అలంపూర్  నియోజకవర్గ అభివృద్ధి జరగలేదని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్  తెలిపారు. శుక్రవారం వడ్డేపల్లి మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్ లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పదేండ్లుగా అలంపూర్  నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కేవలం బీఆర్ఎస్  నాయకులు అక్రమ దందాలు చేసి అందిన కాడికి దోచుకుతిన్నారని మండిపడ్డారు.

పార్లమెంట్  ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీకి మెజార్టీ కట్టబెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. వచ్చే నెల 10 వరకు ఆలంపూర్  100 పడకల ఆసుపత్రిలో అన్ని సౌలతులు కల్పిస్తామన్నారు. మల్లమ్మకుంట రిజర్వాయర్ తో పాటు రోడ్ల నిర్మాణానికి ఫండ్స్  తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీకి ఎదురు ఉండదని చెప్పారు.