రెండు పార్లమెంట్​ స్థానాల్లో గెలిపించాలి : సంపత్​కుమార్​

వనపర్తి, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని రెండు పార్లమెంట్​ స్థానాల్లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని ఏఐసీసీ సెక్రటరీ సంపత్​కుమార్​ కోరారు. మంగళవారం వనపర్తిలో ‘రేవంతన్నకు దండుగా ప్రజాపాలనకు అండగా’ ర్యాలీ నిర్వహించారు. భగీరథ విగ్రహం నుంచి రాజీవ్ చౌక్​ వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గతంలోని బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టడంతోనే ప్రజలు కాంగ్రెస్​ పార్టీకి అధికారం ఇచ్చారన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని, ఇంకోటి కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. మోసపూరిత బీజేపీ సర్కారును గద్దె దించి కాంగ్రెస్​ పార్టీని గెలిపించేందుకు దేశ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు. డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్,  ఏఐపీసీ కో ఆర్డినేటర్​ ఆదిత్యరెడ్డి, రాములు, కోట్ల రవి, యాదయ్య, దివాకర్, రోహిత్​ పాల్గొన్నారు.