Pav Pakoda : ప్రపంచంలోనే అతి చిన్న పావ్ పకోడా

Pav Pakoda : ప్రపంచంలోనే అతి చిన్న పావ్ పకోడా

వడ పావ్, పావ్ భాజీ వంటి బ్రెడ్ వంటకాలు భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ చెందిన స్ట్రీట్ ఫుడ్స్. ఇవి రుచికరమైన వంటకాలే కాదు.. చేయడమూ సులభమే. కూరగాయలతో చేసిన కర్రీ లేదా బ్రెడ్ ను డీప్‌ఫ్రైడ్ చేసి మృదువైన పావ్‌లుగా తయారు చేస్తారు. అయితే ఈ రెండు ఫుడ్స్ ను కలిపి ఒకే ఫుడ్ ను తయారు చేయొచ్చన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా..? అలాంటి ఆలోచనే అహ్మదాబాద్ కు చెందిన ఒక వీధి వ్యాపారి వడ పావ్, పావ్ భాజీలను కలిపి కాటుక సైజు పావ్ పకోడాగా తయారు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియోను అహ్మదాబాద్‌కు చెందిన ఫుడ్ బ్లాగర్ 'foodie_addicted_'ద్వారా ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. బ్లాగర్ ఈ వంటకాన్ని "ప్రపంచంలోని అతి చిన్న పావ్ పకోడాలు" (ప్రపంచంలోని అతి చిన్న పావ్ పకోడాలు) అని పేర్కొన్నాడు. దీన్ని అమ్మే వ్యాపారి చిన్న పావ్‌లను పట్టుకుని వాటిని ఫిల్ చేస్తున్నట్టు  వీడియోలో చూపబడింది. భాజీని పోలి ఉండే  ఓ స్పెషల్ స్నాక్ ను తయారుచేసి, దాన్ని ఓ మందపాటి బేసన్ పిండిలో ముంచి వేడి నూనెలో వేయించాడు.

చాలా మంది ఈ పావ్ పకోడా తయారు చేసే ప్రత్యేకమైన విధానాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు పరిశుభ్రత గురించి ఆందోళన చెందుతున్నారు. ఫుడ్ ను తయారు చేసేటప్పుడు గ్లౌసులు లాంటివి ఏమైనా వేసుకుంటే బాగుంటుందంటూ కొందరు సలహా ఇస్తున్నారు. "పరిశుభ్రత గురించి చింతించకండి..! మీరు పరిశుభ్రతపై ఎక్కువ దృష్టి పెడితే, మీకు ఎక్కువ వ్యాధులు వస్తాయి.. నా వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నా.. ఆ తాతకు సపోర్ట్ చేయండి.. మీ ప్రేమను చూపించి, తినండి..చాలా అద్భుతంగా ఉంటుంది" అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు.

https://www.instagram.com/reel/CoMp-1Hj7I4/?utm_source=ig_embed&ig_rid=626b44ed-fe5b-4918-abd2-466ebfb3eec5