IND vs PAK: బోర్డర్‌లో స్టేడియం కట్టండి.. ఛాంపియన్స్ ట్రోఫీపై షెహజాద్ వింత సలహా

ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు, తీవ్రవాదం, కాశ్మీర్ అంశాల్లో వివాదం నడుస్తుంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వేదికగా జరిగే ఏ క్రికెట్ మ్యాచుల్లోనూ పాల్గొనటం లేదు ఇండియా జట్టు. 2023లో ఆసియా కప్ ను సైతం బహిష్కరించింది టీమిండియా. భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరగక 12 ఏళ్ళు దాటిపోయింది. ఓ వైపు ఇరు జట్ల అభిమానులు దాయాధి జట్ల మధ్య పోరు చూడాలని ఆశతో ఎదురు చూస్తున్నారు.ఈ దశలో పాకిస్థాన్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ ఒక వింత సలహా ఇచ్చాడు. 

"భారత్, పాకిస్థాన్ సిరీస్ చూడడానికి బోర్డర్ లో ఒక స్టేడియం నిర్మించండి. పాకిస్థాన్ సరిహద్దు వైపు ఒక గేట్.. భారత సరిహద్దు వైపు ఒక గేట్ ఉంచండి. ఆయా దేశాల ఆటగాళ్లు తమ గేట్ ద్వారం గుండా వచ్చి వెల్తూ ఉంటారు". అని అహ్మద్ షెహజాద్ ఒక పోడ్ కాస్ట్ లో  తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌ విధానంలో నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆమోదం తెలిపింది. దీంతో భారత్ పాకిస్థాన్ లో పర్యటించకుండా తటస్థ వేదికపై మ్యాచ్ లు ఆడుతుంది. అదే సమయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సైతం భారత్ లో ఐసీసీ టోర్నీ నిర్వహిస్తే రానని ఐసీసీకి చెప్పింది. 

2024 నుంచి 2027 మధ్యలో జరగబోయే ఐసీసీ ఈవెంట్‌లలో భారత్, పాకిస్తాన్ తమ అన్ని మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో ఆడతాయని ఐసీసీ అధికారికరంగా ధృవీకరించింది. దీని ప్రకారం భారత్ లో జరగబోయే ఐసీసీ టోర్నీ కోసం పాకిస్థాన్ రాదు. అదే విధంగా పాకిస్థాన్ భారత్ లో పర్యటించదు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ టీమిండియాకు వెళ్ళదు. 2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ మెగా టోర్నీకి పాకిస్థాన్ భారత్ లో పర్యటించకుండా హైబ్రిడ్ మోడల్ (తటస్థ వేదికల్లో) మ్యాచ్ లు  ఆడుతుంది.