నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎదుట ఉపాధి కూలీల ధర్నా

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ డిమాండ్  చేశారు. సోమవారం కలెక్టరేట్  ఎదుట ఉపాధి కూలీలతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు పనిముట్లు, వేసవి అలవెన్స్  ఇవ్వాలని డిమాండ్  చేశారు. 

కూలీలకు 200 రోజులు కల్పించాలని, రోజుకు రూ.600 కూలీ చెల్లించాలని కోరారు. జాబ్ కార్డు ప్రతి ఒక్కరికీ అందించాలని కోరారు. సీనియర్  మెట్లను ఫీల్డ్  అసిస్టెంట్లుగా గుర్తించాలని డిమాండ్​ చేశారు. ప్రజా సంఘాల నాయకులు పర్వతాలు, శ్రీనివాస్, గీత, శివ శంకర్, ఆంజనేయులు పాల్గొన్నారు.