ఎయిర్ ఫోర్స్, అగ్నివీర్​లో చేరాలి : అనుప్రీతి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  ఇండియన్  ఎయిర్  ఫోర్స్, అగ్నివీర్​లో చేరాలని అగ్నివీర్​ వింగ్  కమాండర్  అనుప్రీతి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని డిగ్రీ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు, యువకులు ఇండియన్  ఎయిర్ ఫోర్స్,  అగ్ని వీర్ లో చేరేందుకు మూడు రౌండ్లలో జరిగే ఆన్​లైన్  ఎగ్జామ్, ఫిజికల్, మెడికల్  టెస్ట్ లో పాల్గొనాలని సూచించారు. 

ఎన్​సీసీ సి సర్టిఫికెట్  ఉంటే ఎంపికలో  ప్రాధాన్యత ఉంటుందన్నారు. యువత వ్యసనాలకు బానిస కాకుండా దేశ రక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రిన్సిపాల్  ఖమర్ సుల్తానా, కమాండర్  సందీప్, డీఈవో గోవిందరాజులు పాల్గొన్నారు.