AP News : ఉండవల్లిలో రెచ్చిపోయిన అల్లరిమూక 

తాడేపల్లి.. ఉండవల్లిలో అల్లరిమూక రెచ్చిపోయింది..  కొంతమంది యువకులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ.. ఉండవల్లి సెంటర్​ లో ఓ హోటల్​ పై డాడిచేశారు.  అడ్డొచ్చిన వారిని చితక్కొట్టారు.  ఈఘటనలో  హోటల్​ యజమానికి తీవ్రగాయాలు కాగా.. మరో 20 మంది కూడా గాయపడ్డారు.  స్థానికులు బ్లేడ్​ బ్యాచ్​గా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  కొంతమంది ఇతర నగరాల నుంచి బహిష్కరణకు గురై.. ఇక్కడ నివసిస్తున్నారని సమాచారం అందుతోంది.  అలాంటి వారందరూ కలిసి ముఠా గా ఏర్పడి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ ఆకతాయిల ఆగడాలతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.  బాధిత హోటల్​ యజమాని తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.