ఐఏఎస్ అకాడమీలో కీచక టీచర్.. మైనర్ పై లైగింక దాడి

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు.. కామాందుడిగా మారి మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విద్యార్థినికి ప్రేమ పాటలు నేర్పి ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టిన కీచక టీచర్ ను ఆర్.జి.ఐ.ఏ పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని కృష్ణ ప్రదీప్ ఐఏఎస్ అకాడమీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

 ఐఏఎస్ అకాడమీలో గత కొంతకాలంగా హిస్టరీ లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్న  నిందితుడు సూర్యదీప్ హిస్టరీ లెక్చరర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అదే చదువుతున్న ఓ మైనర్ విద్యార్థినికి మాయ మాటలు చెప్పి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.  ఈ క్రమంలో విద్యార్థినిని కిడ్నాప్ చేసి హైదరాబాద్ కు తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. పోలీసులను ఆశ్రయించి నిందితుడు సూర్యదీప్ పై ఫిర్యాదు చేశారు.

దీంతో కేసు నమోదు చేసి తమదైన శైలిలో విచారణ చేపట్టి నిందితుడు సూర్యదీప్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. నిందితుడిపై కిడ్నాప్, ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

కృష్ణ ప్రదీప్ ఐఏఎస్ అకాడమీ ఘటనను నిరసిస్తూ అకాడమీ ముందు బైఠాయించిన ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కృష్ణ ప్రదీప్ ఐఏఎస్ అకాడమీ గుర్తింపును రద్దు చేయాలని.. నిందితుడు సూర్యదీప్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు.