భువనగిరిలో ఏజీఐ గ్లాస్‌ ప్లాంట్‌ ఓపెన్‌!

భువనగిరిలో ఏజీఐ గ్లాస్‌ ప్లాంట్‌ ఓపెన్‌!

హైదరాబాద్‌, వెలుగు: బ్యూటీ ప్రొడక్ట్‌‌లను స్టోర్‌ చేయడానికి వాడే గ్లాస్‌‌ బాటిల్స్‌‌ను తయారు చేసేందుకు ఏజీఐ గ్లాస్ ప్యాక్‌‌  భువనగిరిలో కొత్త ప్లాంట్‌‌ను ఏర్పాటు చేసింది. స్పెషల్ గ్లాస్ సెగ్మెంట్‌‌కు డిమాండ్ పెరుగుతోందని, ఈ డిమాండ్‌‌ను చేరుకోవడానికి ఈ ప్లాంట్ తోడ్పడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ ప్లాంట్ కెపాసిటీ రోజుకి 154 టన్నులు. ఈ కొత్త ప్లాంట్‌‌లో వయల్స్‌‌, నెయిల్‌‌ పాలిష్ బాటిల్స్‌‌ వంటి గ్లాస్‌‌ ప్రొడక్ట్స్‌‌ను తయారు చేస్తారు. అంతేగాక బెవరేజ్‌‌ గ్లాస్‌‌ బాటిల్స్‌‌ను కూడా తయారు చేస్తామని ఏజీఐ పేర్కొంది. 'ఈ కొత్త ప్లాంట్‌‌ వల్ల ప్రత్యక్షంగా 350 మందికి ఉద్యోగాలొస్తాయి. భువనగిరి ప్లాంట్‌‌తో  దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది' అని ఏఐజీ వివరించింది. ఈ ప్లాంట్ నుంచి ఏడాదికి రూ. 400 కోట్ల రెవెన్యూని టార్గెట్‌‌గా పెట్టుకున్నామని ఏజీఐ గ్లాస్‌‌ప్యాక్‌‌ సీఈఓ రాజేష్‌‌ ఖోస్లా అన్నారు.