భారత్ లో మరో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి

భారత్ లో మరో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి
భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ కు అనుమతి లభించింది. డేటా ఎనలైజ్ చేసిన నిపుణులు వ్యాక్సిన్ను  అత్యవసర పరిస్థితుల కింద వినియోగించుకునేందుకు పర్మీషన్ ఇచ్చింది. ఇవ్వాళ భేటీ అయిన కమిటీ భారత్ బయోటెక్ ఇచ్చిన రిపోర్ట్ ను చెక్ చేసింది. అన్నీ సంతృప్తి కరంగా ఉండడంతో నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వ్యాక్సిన్ కు అనుమతి ఇవ్వొచ్చని చెప్పింది. నిన్న అక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ రిపోర్ట్ ను వ్యాక్సిన్ నిపుణుల బృందానికి ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ ప్రజెంటేషన్ తో నిపుణలు బృందం కోవిషీల్డ్ వినియోగానికి అనుమతి ఇచ్చింది. నిన్న భారత్ బయోటెక్ సైతం వ్యాక్సిన్ పై ప్రజెంటేషన్ ఇచ్చింది. అయితే ఈరోజు మరో సారి భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ పై రిపోర్ట్ ను చెక్ చేసి అనుమతి మంజూరు చేసింది. దీంతో డ్రగ్ కంట్రోల్ అథారిటీ అనుమతిస్తే ప్రజలకు కోవాగ్జిన్ సైతం అందుబాటులోకి రానుందని భారత్ బయోటెక్ తెలిపింది.