న్యూఢిల్లీ: సాధారణ డిస్ట్రిబ్యూటర్లకు, బిజినెస్టు బిజినెస్ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మే ప్రొడక్టుల ధరల్లో తేడాలను తొలగించాలన్న తమ రిక్వెస్టును పట్టించుకోనందుకు కోల్గేట్ పామోలివ్ ప్రొడక్టులను వారంపాటు అమ్మబోమని మహారాష్ట్ర ఎఫ్ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. వారం తరువాత కూడా కంపెనీ దిగిరాకుంటే మరింత కఠినంగా వ్యవహరిస్తామని, వేద్‌శక్తి బ్రాండ్ సేల్స్‌ను పూర్తిగా నిలిపేస్తామని చెప్పారు. జియోమార్ట్, వాల్‌మార్ట్, మెట్రో, బుకర్, ఎలాస్టిక్, ఉడాన్ వంటి బీ2బీ డిస్ట్రిబ్యూటర్లకు తక్కువ ధరలకు, తమకు ఎక్కువ ధరలకు ప్రొడక్టులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయమై కోల్గేట్ఎగ్జిక్యూటివ్ ఒకరు మాట్లాడుతూ సాధారణ డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను పరిష్కరించడంపై ఫోకస్ చేశామని అన్నారు. ఆలిండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ మాత్రం కోల్గేట్ వాదనను ఒప్పుకోవడం లేదు.
