చంద్రబాబు రాకతో తెలంగాణలో మద్యం అమ్మకాలపై ఎఫెక్ట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణలో మద్యం అమ్మకాలపై ప్రభావం పడింది. తెలంగాణ ఆంధ్ర బార్డర్ ప్రాంతాలలో అప్పటి వరకు జాతరలా తలపించే వైన్ షాపుల గిరాకీ దాదాపు పడిపోయింది. దీనికి కారణం ఏపీ ప్రభుత్వం అక్టోబర్ లో కొత్త మద్యం పాలసీ తేవడం. అప్పటి నుంచే క్రమంగా మన బార్డర్ షాపులపై ఎఫెక్ట్ మొదలైంది. 

రెండు వారాల క్రితం11 లిక్కర్ కంపెనీలు మద్యం ధరలను తగ్గించాయి. ఉదాహరణకు మ్యాన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హౌస్ బ్రాండ్ క్వార్టర్ ధర 2019లో రూ.110 ఉండగా, తర్వాత ఒకేసారి రూ.300కు పెంచారు. దీనిపై విమర్శలు రావడంతో రూ.220కి తగ్గించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇటీవల క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గింది. ఇందులో హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.440 ఉండగా రూ.380కి, ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గింది. రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విస్కీ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.230 నుంచి రూ.210కి తగ్గింది. ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గింది. యాంటిక్విటీ విస్కీ ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధర రూ.1,600 నుంచి రూ.1,400కు తగ్గింది. 

ఇలా ఏపీలో బ్రాండెడ్ మద్యం రెండు నెలలుగా అందుబాటులోకి రావడం, తెలంగాణతో పోలిస్తే ధరలో కూడా పెద్దగా తేడా లేకపోవడం, కొన్ని బ్రాండ్లు మనకంటే అక్కడే తక్కువ ధరకు దొరుకుతుండడంతో ఇక్కడ సేల్స్ తగ్గిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా అమ్ముడయ్యే బ్రాందీ క్వార్టర్ బాటిల్ రూ.130 ఉండగా, ఇదే బ్రాండ్ ఏపీలో రూ.120కే అమ్ముతున్నారు. ఇక చీప్ లిక్కర్ ను రూ.99కే క్వార్టర్ బాటిల్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. దీంతో గతేడాది వరకు ఎప్పుడూ జాతరను తలపించేలా ఉండే ఎర్రుపాలెం వైన్ షాప్ దగ్గర ప్రస్తుతం రష్​ బాగా తగ్గిపోయిందని ఎక్సైజ్ ఆఫీసర్లే ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నారు.

ఈ ఏడాది రూ. 200 కోట్ల  మేరకు తగ్గిన సేల్స్ 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతేడాది డిసెంబర్ నెలలో రూ.264 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది డిసెంబర్ లో రూ.228 కోట్ల మద్యం సేల్ అయినట్టు సమాచారం. లిక్కర్ సేల్స్ లో ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే రూ.36 కోట్ల తగ్గుదల కనిపిస్తుండగా, మిగిలిన ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు కలిపి దాదాపు రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు అమ్మకాలు తగ్గినట్టు తెలుస్తోంది. 

అయితే సేల్స్ తగ్గడంపై ఏపీ ప్రభావం ఉందని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ అధికారులు అనధికారికంగా అంగీకరిస్తున్నా, అధికారికంగా మాత్రం దీనిపై స్పందించడం లేదు. అయితే, వైన్ షాపుల లైసెన్స్ లు దక్కించుకున్న వారు గతేడాది డిసెంబర్ నుంచి అమ్మకాలు ప్రారంభించారని, అందుకే గతేడాది డిసెంబర్ లో ఎక్కువ స్టాక్ తీసుకోవడం వల్ల ఈ సారి అమ్మకాలు తగ్గినట్టుగా కనిపిస్తోందని చెప్పుకొస్తున్నారు.