80 ఏళ్లుగా కొనసాగిన ఆస్తి వివాదానికి బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దక్షిణ ముండూలోని రెండు ప్లాట్లను వాటి యజమాని 93 ఏళ్ల మహిళ (డిసౌజా)కు అప్పగించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 1942, మార్చి 28న అప్పటి బ్రిటీష్ పాలకులు ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు డిఫెన్స్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం ఈ భవనం రిక్విజిషన్ చేయబడింది. భవన యజమానులు అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. 1946 జులైలో రిక్విజిషన్ ఉత్తర్వులు రద్దు చేసినప్పటికి ఆ ప్లాట్లను యజమాని అలిస్ డిసౌజాకు అప్పగించలేదని పేర్కొన్నారు.
1946 మే 4 న బాంబై హైకోర్టు న్యాయమూర్తులు ఆర్‌డి ధనుక , ఎంఎం సతయేలతో కూడిన డివిజన్ బెంచ్ రిక్విజషన్ రద్దు చేస్తూ ఆ భవనాలను పిటిషనర్‌కు అప్పగించాలని తీర్పునిచ్చింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో 1946 జులైలో భవన యజమాని ఫ్లాట్‌లను తనకు అప్పగించేలా మహారాష్ట్ర ప్రభుత్వానికి,ముంబై కలెక్టర్‌కు ఆదేశాలు ఇవ్వాలని డిసౌజా తన పిటిషన్‌లో కోరారు. ప్రాంగణంలో భౌతిక స్వాధీనాన్ని యజమానికి (డిసౌజా) అప్పగించలేదని, అందువల్ల డి-రిక్విజిషన్ పూర్తి కాలేదని బెంచ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
1940 రిక్విజిషన్ ఆర్డర్ ప్రకారం పౌర సేవల విభాగంలో పనిచేసే ప్రభుత్వ అధికారి ఆ ఫ్లాట్లలో నివాసముంటున్నారు. 93 ఏళ్ల మహిళకు ఆ ఫ్లాట్‌లను అప్పగించేందుకు వ్యతిరేకించారు. ఎనిమిది వారాల్లోగా శాంతియుతంగా ఉన్న స్థలాన్ని పిటిషనర్ (డిసౌజా)కి అప్పగించాలని బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
