జింబాబ్వేతో  మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌.. అఫ్గాన్‌‌ సొంతం

హరారే : జింబాబ్వేతో  మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌ను అఫ్గానిస్తాన్‌‌ 2–0తో సొంతం చేసుకుంది. శనివారం జరిగిన మూడో వన్డేలో అఫ్గాన్‌‌ 8 వికెట్ల తేడాతో గెలిచింది.  తొలుత జింబాబ్వే 30.1 ఓవర్లలో 127 రన్స్‌‌ కు ఆలౌటైంది. సీన్‌‌ విలియమ్స్‌‌ (60) టాప్‌‌ స్కోరర్‌‌.

గజ్నాఫర్‌‌ 5, రషీద్‌‌ ఖాన్‌‌ 3 వికెట్లు తీశారు. తర్వాత అఫ్గానిస్తాన్‌‌ 26.5 ఓవర్లలో 131/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. సెదిఖుల్లా అటల్‌‌ (52)తో పాటు  అబ్దుల్‌‌ మాలిక్‌‌ (29) రాణించాడు. గజ్నాఫర్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’, అటల్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌’ అవార్డులు లభించాయి.