సౌతాఫ్రికాకు అఫ్గాన్‌‌ షాక్‌‌

షార్జా : బ్యాటింగ్‌‌‌‌‌‌లో రెహమానుల్లా గుర్బాజ్‌‌‌‌ (105), బౌలింగ్‌‌‌‌లో రషీద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (5/19), నంగెయాలియా ఖరోటె (4/26) చెలరేగడంతో.. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్తాన్‌‌‌‌ 177 రన్స్‌‌‌‌ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ మరోటి మిగిలి ఉండగానే 2–0తో కైవసం చేసుకుంది. సఫారీలపై అఫ్గాన్‌‌‌‌కు ఇదే తొలి సిరీస్‌‌‌‌ విక్టరీ కావడం విశేషం. అలాగే రన్స్‌‌‌‌ పరంగా కూడా అతి పెద్ద విజయం. 

టాస్‌‌‌‌ నెగ్గిన అఫ్గానిస్తాన్‌‌‌‌ 50 ఓవర్లలో 311/4 స్కోరు చేసింది. గుర్బాజ్‌‌‌‌కు తోడుగా అజ్మతుల్లా ఒమర్‌‌‌‌జాయ్‌‌‌‌ (86 నాటౌట్‌‌‌‌), రహమత్‌‌‌‌ షా (50) రాణించారు. ఛేజింగ్‌‌‌‌లో సౌతాఫ్రికా 34.2 ఓవర్లలో 134 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. కెప్టెన్‌‌‌‌ టెంబా బవుమా (38), టోనీ డి జోర్జి (31), మార్‌‌‌‌క్రమ్‌‌‌‌ (21), హెండ్రిక్స్‌‌‌‌ (17) మినహా మిగతా వారు నిరాశపర్చారు. ఇన్నింగ్స్‌‌‌‌లో ఏడుగురు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితమయ్యారు. రషీద్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.