మైత్రీ మూవీ మేకర్స్​పై చర్యలు తీసుకోండి..నాంపల్లి కోర్టులో అడ్వకేట్ తిరుమలరావు పిటిషన్

బషీర్​బాగ్, వెలుగు: మైత్రీ మూవీ మేకర్స్, జై హనుమాన్ చిత్ర యూనిట్​పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి క్రిమినల్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న 'జై హనుమాన్' మూవీ టీజర్‌‌లో హనుమంతుడిని కించపరిచేలా సీన్లు ఉన్నాయని అడ్వకేట్ మామిడాల తిరుమలరావు ఆరోపించారు. వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌‌లో మీడియాతో మాట్లాడారు.

గతేడాది అక్టోబర్ 30న విడుద లైన టీజర్‌‌లో హనుమంతుని ముఖచిత్రం బదులు నటుడు రిషబ్ శెట్టి మొహం చూపిం చడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వల్ల భవిష్యత్ తరాలకు హనుమంతుడు అంటే ఎవరో అని గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ అంశంతో హిందువుల మనోభావాలు దెబ్బ తింటాయన్నారు. దీనికి బాధ్యులుగా  దర్శకుడు ప్రశాంత్ వర్మ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, నటుడు రిషబ్ శట్టిలపై నాంపల్లి 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్(ఏసీజేఎం) కోర్టులో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.