బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిక

ములుగు, వెలుగు: స్థానిక సంస్థల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగుతోందని సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం ములుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మల్లేశ్ , అశోక్ తో పాటు 100 మంది బీఆర్ఎస్ నాయకులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, ఎలక్షన్ రెడ్డి ఆధ్వర్యంలో  కాంగ్రెస్​లో చేరారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి  వారికికండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.