రూ. 6,300 కోట్లకు సువెన్ ఫార్మాస్యూటికల్స్‌‌ సేల్‌‌

రూ. 6,300 కోట్లకు సువెన్ ఫార్మాస్యూటికల్స్‌‌ సేల్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు:  హైదరాబాద్‌‌కు చెందిన సువెన్ ఫార్మాస్యూటికల్స్‌‌ను కొనుగోలు చేయడానికి అడ్వెంట్‌‌ ఇంటర్నేషనల్ ముందుకొచ్చింది. ప్రమోటర్ల నుంచి 51 శాతం వాటాను దక్కించుకోవడానికి రూ. 6,350 కోట్లను ఈ కంపెనీ ఆఫర్ చేసింది. ప్రస్తుతం మార్కెట్‌‌లో సువెన్ ఫార్మాస్యూటికల్స్‌‌, సువెన్ లైఫ్ సైన్సెస్‌‌లు లిస్ట్ అయ్యాయి. ఇందులో సువెన్ ఫార్మాలోని కంట్రోలింగ్ వాటాను అమ్మడానికి  ప్రమోటర్ జాస్తి వెంకటేశ్వర్లు, ఆయన ఫ్యామిలీ డీల్ కుదుర్చుకుంది. మరో 26 శాతం వాటాను ఓపెన్ ఆఫర్ ద్వారా  కొనుగోలు చేస్తామని అడ్వెంట్ ప్రకటించింది.  ఇది కూడా కలిపితే  డీల్ విలువ రూ.8,100 కోట్ల (బిలియన్ డాలర్ల) కు చేరుకుంటుంది. షేరు వాల్యూ రూ.500 – 504 వద్ద ఈ డీల్ కుదిరింది. సువెన్ ఫార్మా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12,682 కోట్లుగా ఉంది.  ప్రస్తుతం ఈ ఫార్మా కంపెనీలో  ప్రమోటర్లకు  60 శాతం వాటా ఉంది.  కాగా, ఇతర ఫార్మా కంపెనీలతో కాంట్రాక్ట్ చేసుకొని రీసెర్చ్‌‌, మాన్యుఫాక్చరింగ్ చేసే సువెన్ ఫార్మాను దక్కించుకోవడానికి  బ్లాక్‌‌స్టోన్‌‌ కూడా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ,  అడ్వెంట్‌‌ ఇచ్చిన ఆఫర్‌‌‌‌ను ఈ ఫార్మా కంపెనీ బోర్డు  అంగీకరించింది.   కొహన్స్‌‌ లైఫ్ సైన్సెస్  ద్వారా  ఈ ఫార్మా కంపెనీని అడ్వెంట్ కొనుగోలు చేస్తోంది. కిందటి నెల తమ యాక్టివ్‌‌ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్‌‌ (ఏపీఐ) బిజినెస్‌‌ను కొహన్స్ లైఫ్‌‌ సైన్సెస్‌‌గా మార్చారు. ఈ కంపెనీ ఆర్‌‌‌‌ఏ కెమ్‌‌ ఫార్మా, జెడ్‌‌సీఎల్‌‌ కెమికల్స్‌‌, అవ్రా ల్యాబొరేటరీస్‌‌ను కూడా ఆపరేట్ చేస్తోంది.

తయారీపై ఫోకస్‌‌..

సువెన్ ఫార్మాను డీమెర్జ్ చేయడానికి, ఫార్మా బిజినెస్‌‌లో కంట్రోలింగ్ వాటాను అమ్మడానికి  2020 ప్రారంభంలో బేర్‌‌‌‌క్లేవ్స్‌‌ను అడ్వైజర్‌‌‌‌గా జాస్తి వెంకటేశ్వర్లు, ఆయన ఫ్యామిలీ నియమించింది. కొన్ని ఫండ్స్ ముందుకొచ్చినప్పటికీ, మార్కెట్‌‌ పడడం వలన కంపెనీ వాల్యు తగ్గింది. ఈ ఏడాది ప్రారంభంలో  వాటాల అమ్మకంపై చర్చలు తిరిగి షురు అయ్యాయి. సువెన్ ఫార్మాకు హైదరాబాద్‌‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌‌మెంట్ సెంటర్‌‌‌‌, మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌‌ ఉన్నాయి. న్యూజెర్సీలో బిజినెస్ డెవలప్‌‌మెంట్ ఆఫీస్ కూడా ఉంది. మెడిసిన్స్ తయారీలో వాడే ఇంటర్మీడియెట్స్‌‌, ఏపీఐల డెవలప్‌‌మెంట్‌‌ సువెన్ ఫార్మా చేపడుతోంది.  బిజినెస్‌‌ను మరింతగా విస్తరించేందుకు  హైదరాబాద్‌‌కు చెందిన మరో కంపెనీ కాస్పెర్‌‌‌‌ ఫార్మా తయారీ ప్లాంట్‌‌ను తాజాగా రూ.155 కోట్లకు కొన్నది.

ఫైనాన్షియల్, స్ట్రాటజిక్ పార్టనర్ కావాలనుకున్నాం. తమ సామర్ధ్యాన్ని అడ్వెంట్‌‌కు చెందిన కొహన్స్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ మరింతగా పెంచగలదు.   వారు  కంపెనీలో కంట్రోలింగ్ వాటా అడిగారు. కంట్రోలింగ్ వాటాను అమ్మాలనే ఆలోచన స్టార్టింగ్‌‌లో లేదు. దీనికి ఒప్పుకున్నాం. కానీ, బిజినెస్‌‌ యదావిధిగా కొనసాగుతుంది. ఇందుకోసమే వారు కంట్రోలింగ్‌‌ వాటాను తీసుకున్నారు.
-సువెన్ ఫార్మా ఎండీ, జాస్తి వెంకటేశ్వర్లు