ఉస్మానియాలో పోస్ట్ ఎమ్మెస్సీ కోర్సులో అడ్మిషన్స్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఉస్మానియా యూనివర్సిటీ 2024–-25 విద్యా సంవత్సరానికి పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా కోర్సులో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది. ఈ కోర్సు ఎంఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జే ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, కిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్, అమెరికన్ ఆంకాలజీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్, ఒమేగా హాస్పిటల్, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో ఓయూ నిర్వహిస్తోంది.

కోర్సులు: పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రేడియోలాజికల్ ఫిజిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోర్సులో 16 సీట్లు ఉన్నాయి. కోర్సు డ్యురేషన్​ 2 సెమిస్టర్లు (ఒక ఏడాది) + ఏడాది ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్/ ఫీల్డ్ ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంటుంది.

సెలెక్షన్​ ప్రాసెస్: అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి.  ఎగ్జామ్​ డిసెంబర్​ 14న నిర్వహిస్తారు. వివరాలకు www.osmania.ac.in వెబ్​సైట్‌లో సంప్రదించాలి.