Lakhimpur Kheri Case: సిట్ నివేదికపై వేడెక్కనున్న పార్లమెంట్

Lakhimpur Kheri Case: సిట్ నివేదికపై వేడెక్కనున్న పార్లమెంట్

పార్లమెంట్ సమావేశాలు ఇవాళ వాడి వేడిగా జరగనున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాల వరుస ఆందోళనలతో పెద్దల సభలు అట్టుడుకుతున్నాయి. దీనికి తోడు యూపీలో సంచలనం రేపిన లఖింపూర్ ఖేరీ ఘటనపై తాజాగా సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో ఇప్పుడా సిట్ దర్యాప్తు నివేదిక పార్లమెంట్ ను కుదిపేయనుంది. ఇప్పటికే లిఖింపూర్ ఖేరి ఘటన ,సిట్ దర్యాప్తు నివేదిక పై చర్చ జరపాలని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు వాయిదా తిర్మనాలు ఇచ్చాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే విషయంపై మరోవైపు పదిన్నర గంటలకు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో సమావేశం కానున్నాకగ సోనియాగాంధీ. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు.

లఖింపూర్ ఖేరీ ఘటన విషయానికోస్తే..  ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో రైతులపై జరిగిన హింసాకాండ ఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం రేకెత్తించింది. కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా పర్యటనలో నిరసన చేస్తున్న రైతులపైకి ఆయన కొడుకు ఆశిశ్‌ మిశ్రా కారుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా.. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేంద్ర మంత్రి కొడుకు ఆశిశ్‌ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే.. రైతులు, విపక్షాల నుంచి వచ్చిన ఒత్తిడితో కేంద్రం.. ఈ ఘటనపై సిట్‌ దర్యాప్తుకు ఆదేశించింది.

ఈ ఘటనపై దర్యాప్తు చేసిన సిట్‌.. మంగళవారం నివేదిక అందించింది. ఆ రిపోర్టులో కీలక విషయాలను వెల్లడించింది. ఈ హింసాకాండ ప్రణాళికాబద్దమైన కుట్ర సిట్‌ వెల్లడించింది. అయితే.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా త‌న‌యుడు అశిశ్ మిశ్రాపై ఇప్పటికే న‌మోదైన‌ అభియోగాల‌ను మార్చాల‌ంటూ ఈ కేసు విచార‌ణ జ‌రుపుతున్న న్యాయ‌మూర్తికి సిట్ లేఖ రాసింది. ఇప్పటికే ఈ కేసులో మంత్రి కుమారుడు ఆశిశ్‌ మిశ్రా, తదితరులపై హత్య, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలతోపాటు హత్యయత్నం, ఇతర అభియోగాలను కూడా ఈ కేసులో చేర్చాలని సిట్‌ ఆ లేఖలో కోరింది.

https://twitter.com/ANI/status/1470979768396902401