ఉద్యోగాలు, బోనస్ లు, ప్రమోషన్లకు ఎలాంటి ఢోకా ఉండదంటూ హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ మేనేజింగ్ డైరక్టర్, సీఈఓ ఆదిత్య పూరి ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఆయన ఈ నెలలో పదవీ విరణమణ చేస్తున్నారు.
కరోనా వైరస్ నేపథ్యంలో అన్నీ రంగాలకు చెందిన సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. జీతాల్ని కట్ చేస్తున్నాయి. మరోవైపు సీఈఓ హోదాలో ఆదిత్యపూరి పదవీ విరమణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు భరోసా కల్పించేందుకు హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ సీఈఓ మాట్లాడుతూ దేశంలో అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్ డీఎఫ్ సీలో సుమారు 1.5 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. ఉద్యోగుల భద్రత, జీతాలు, బోనస్ లు ఎక్కడికీ పోవని, తాను బ్యాంకు, తన అనంతరం బాధ్యతలు చేపట్టనున్న శశిధర్ జగదీషన్ తరఫున హామీ ఇస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల పనితీరు బాగుందని, ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లోను బ్యాంకు ఉద్యోగుల పనితీరు బాగుందని, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందిలేదని, ఉద్యోగులకు ఆదిత్యాపురి భరోసా ఇచ్చారు.
