సీఎం గ్రీవెన్స్ పైలెట్ ప్రాజెక్టుగా  ఆదిలాబాద్ జిల్లా ఎంపిక

  • సంక్రాంతి తర్వాత అర్జీల స్వీకరణ
  • కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్, వెలుగు: సీఎం గ్రీవెన్స్ పైలెట్ ప్రాజెక్టు కింది ఆదిలాబాద్ జిల్లా ఎంపికైనట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. అర్జీలను ఆన్​లైన్​లో నమోదు చేసే డేటా ఆపరేటర్లు, ఎంపీడీవోలకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ..  గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా ‘సీఏం ప్రజావాణి’ చేపట్టనున్నట్లు తెలిపారు.

మండల కేంద్రాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని, వచ్చిన దరఖాస్తులను అన్ని అంశాలతో కూడిన స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ వ్యవస్థను రూపొందిస్తామన్నారు. అర్జీదారులు అందించే సమస్యను గురించి ఆన్​లైన్ లో ఆ అంశాన్ని ఎంపిక చేసుకొని దరఖాస్తుదారుడికి వెంటనే రసీదు ఇవ్వడం, సంబంధిత అధికారికి ఫార్వడ్ చేసి సమస్య ఏ స్థాయిలో ఉందో తెలిపేలా పంపిస్తారన్నారు. సంక్రాంతి తర్వాత అర్జీల స్వీకరిస్తామని పేర్కొన్నారు.

రక్తదాన శిబిరం ప్రారంభం

రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా బుధవారం ఆర్టీసీ డీపో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. మొత్తం 23 మంది ఆర్టీసీ సిబ్బంది రక్తదానం చేశారు.