అబ్బాయి ప్లేస్ లో బాబాయ్... కడప ఎంపీ సీటుపై స్కెచ్ మార్చిన బాబు

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సంపిస్తున్న కొద్దీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ముఖ్యంగా ఈసారి కడప జిల్లా రాజకీయాలు తీవ్ర ఉత్కంఠగా మారాయి. 2019 ఎన్నికల్లో లాగానే ఈ ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేసి తమ సత్తా చాటాలని వైసీపీ శ్రేణులు భావిస్తుండగా, జగన్ సొంత జిల్లాలో వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించి వైసీపీ కాన్ఫిడెంట్ మీద దెబ్బ కొట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా, సీన్లోకి జగన్ సోదరి, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఎంట్రీ ఇవ్వటంతో ఉత్కంఠ రెట్టింపయ్యింది. షర్మిల అవినాష్ కి పోటీగా కడప పార్లమెంట్ బరిలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కడప ఎంపీ స్థానాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. ముందుగా కడప ఎంపీ అభ్యర్థిగా టీడీపీ మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అన్న కొడుకు భూపేష్ ని ప్రకటించగా ప్రస్తుతం షర్మిల ఎంట్రీ ఇవ్వటంతో ఆ సీటు గురించి చంద్రబాబు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. భూపేష్ ని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి పంపించి, ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీగా బరిలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అవినాష్, షర్మిల మధ్య ఉన్న గట్టి పోటీ తమకు లాభపడుతుందని బాబు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు ఆదినారాయణ రెడ్డి కూడా మీడియాతో చెప్పిన సంగతి తెలిసిందే. తర్వరలోనే ఈ మార్పుపై అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం. 

ALSO READ :- కేజ్రీవాల్‌కు ఊరట.. సీఎం పదవి నుంచి తొలగించలేం : ఢిల్లీ హైకోర్టు