క్యాంటీన్ ఏర్పాటుకు స్థల పరిశీలన

అమ్రాబాద్, వెలుగు : మండలంలోని మన్ననూర్ ఫారెస్ట్  చెక్ పోస్ట్  వద్ద ఇందిరా మహిళా క్యాంటీన్ ఏర్పాటుకు అడిషనల్  డీఆర్డివో లక్ష్మీనారాయణ బుధవారం స్థలాన్ని పరిశీలించారు. శ్రీశైలం, మద్దిమడుగు, హైదారాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో బిజినెస్  బాగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. చెక్ పోస్ట్  వద్ద క్యాంటీన్  ఏర్పాటుతో మహిళలు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పారు.

Also read : భువనగిరిలో రూ.4 కోట్ల గంజాయి దహనం

ఫారెస్ట్  అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా క్యాంటీన్  ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నాణ్యత విషయంలో ఇందిరా మహిళా క్యాంటీన్లు ఆదర్శంగా ఉంటాయని చెప్పారు. డీపీఎం అరుణాదేవి, ఏపీఎం రాంరెడ్డి, మండల సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి, సీసీ శ్రీనివాస్, వీవోఏలు ఆంజనేయులు, వెంకటయ్య పాల్గొన్నారు.