స్టూడెంట్లకు సరిపడా టాయిలెట్స్ నిర్మించాలి : అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్

గండీడ్, వెలుగు:  స్టూడెంట్‌‌లకు సరిపడా టాయిలెట్స్ , మరుగు దొడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని మహబూబ్‌‌ నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ చెప్పారు. శుక్రవారం వెలుగు పత్రికలో  ‘అత్యవసరమైనా....అరగంట క్యూలో ఉండాలే’... అనే శీర్షిక ప్రధాన సంచికలో వెలువడింది. దీంతో  శుక్రవారం మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలను అడిషనల్  కలెక్టర్ విజిట్ చేశారు. స్కూల్‌‌లో మూత్రశాలలు, మరుగుదొడ్లు పరిశీలించారు.  స్టూడెంట్ లకు సరిపడా మరిన్ని టాయిలెట్స్, మరుగుదొడ్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలనిఈఈ, ఏఈలకు సూచించారు.

  మన ఊరు మనబడిలో భాగంగా ఎంపికైన పనులు ఎందుకు పూర్తి చేయలేదంటూ కాంట్రాక్టరును ప్రశ్నించారు. సకాలంలో బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయని చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్ అదనపు కలెక్టర్‌‌‌‌ను కోరారు. డీఈవో రవీందర్, ప్రత్యేక అధికారి చత్రునాయక్, ఎంఈవో రాజునాయక్, ఈఈ నరేందర్ రెడ్డి, ఏఈ మతీన్, ఎంపీవో నరేందర్రెడ్డి, హెచ్ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.