రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి : సీతారామరావు

  • అడిషనల్​ కలెక్టర్ సీతారామరావు 

ఉప్పునుంతల, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని  అడిషనల్​ కలెక్టర్ సీతారామారావు నిర్వాహకులకు సూచించారు. ఉప్పునుంతల మండలంలోని మొలగర వద్ద ఏర్పాటు చేసిన సింగిల్ విండో గోడౌన్​ సెంటర్ ను సోమవారం ఆయన  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.

 రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మి మద్దతు ధర, బోనస్​ పొందాలని సూచించారు. రైస్ మిల్ యాజమాన్యాలతో మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మాధవి, జిల్లా సహకార అధికారి రఘునాథ రావు, జిల్లా మేనేజర్ రాజేందర్, తహసీల్దార్ ప్రమీల, సూపరింటెండెంట్ మధు, ఏవో కొర్ర రమేశ్, సీఈవో కొత్త రవీందర్​రావు, ఏఈవో లక్ష్మి రాగసంధ్య తదితరులు పాల్గొన్నారు.