సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ 

మెదక్, వెలుగు: సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ కోసం 516 మంది ఆపరేటర్లను నియమించామని అడిషనల్​ కలెక్టర్ నగేశ్ తెలిపారు. గురువారం మెదక్​ కలెక్టరేట్ లో ఆపరేటర్లకు శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 20 మంది ఎంపీడీవోలు, నలుగురు మున్సిపల్ కమిషనర్లు, 19 మంది స్పెషల్​ఆఫీసర్లు, డాటా ఎంట్రీ ప్రక్రియలో పాల్గొంటారని తెలిపారు. సర్వే వివరాల నమోదు లో కంప్యూటర్ ఆపరేటర్లు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.

చిన్న పొరపాట్లకు కూడా తావివ్వకుండా ప్రణాళిక ప్రకారం డేటా ఎంట్రీ చేయాలని సూచించారు. ఆపరేటర్లు చేసిన డేటా ఎంట్రీని ఎన్యూమరేటర్ తప్పనిసరిగా పరిశీలించి ఓకే చేయాలన్నారు. జిల్లాలో సమగ్ర సర్వే నిన్నటి వరకు 86  శాతం పూర్తయిందని తెలిపారు. సర్వేపై ఈడీయం సందీప్ ఆపరేటర్లకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, ముఖ్య ప్రణాళికాధికారి బద్రీనాథ్ పాల్గొన్నారు.