మిల్లింగ్ ​స్పీడప్ ​చేయాలి : అడిషనల్​ కలెక్టర్ ​నగేశ్

  • అడిషనల్​ కలెక్టర్ ​నగేశ్

​మెదక్​టౌన్, వెలుగు: మిల్లింగ్ ​స్పీడప్​ చేసి సీఎంఆర్​ పూర్తి చేయాలని కలెక్టర్ ​నగేశ్​ రైస్ ​మిల్లర్లను ఆదేశించారు. శనివారం మెదక్​కలెక్టరేట్ లో జిల్లా రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్​ కలెక్టర్ మాట్లాడుతూ.. మిల్లర్లు వానాకాలం బియ్యం డెలివరీని నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. అలాగే యాసంగి సీజన్​లో ప్రభుత్వం కొనుగోలు చేసిన 2,52,013 టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని 67 రైస్ మిల్లులకు కేటాయించామన్నారు.

దీనికి 1,70,856 టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందజేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 99,339 టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందజేశారని, మిగిలిన 71,517 టన్నుల బియ్యం గడువులోగా అందజేయాలని రైస్ మిల్లర్లను ఆదేశించారు. సమావేశంలో అధికారులు హరికృష్ణ, సురేశ్ రెడ్డి, జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రపాల్,  రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.