మెదక్టౌన్, వెలుగు: గ్రూప్2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అడిషనల్కలెక్టర్నగేశ్అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలన్నారు. జిల్లాలో 16 కేంద్రాల్లో 5,855 మంది అభ్యర్థులు పరీక్ష రానున్నట్లు తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాలను అధికారులు సందర్శించి మౌలిక వసతులు సరిగా ఉన్నాయా లేవా పరిశీలించాలన్నారు. అభ్యర్థుల కోసం ఆర్టీసీ బస్సులు నడపాలని సూచించారు.
అంతకుముందు బయోమెట్రిక్ విధానంపై అధికారులు, ఇన్విజిలేటర్లకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్పీమహేందర్, డీఆర్వో భుజంగరావు, ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, జయచంద్రారెడ్డి, ప్రిన్సిపాల్హుస్సేన్, అబ్జర్వర్ శ్రీధర్ , డీపీవో యాదయ్య, డీఐవో మాధవి, మెప్మా పీడీ ఇందిర, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ నీలిమ పాల్గొన్నారు.