మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: నేతన్నకు చేయూత పథకం కింద రూ.2 కోట్ల 15 లక్షల 59 వేల చెక్కును చేనేత కార్మికులకు అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు అందచేశారు. ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా శనివారం కలెక్టరేట్ లో చేనేత, జౌళి కార్మికుల సమావేశం జరిగింది.
కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు. నేతన్న బీమా ద్వారా చనిపోయిన కార్మికుని కుటుంబ సభ్యులకు 5 లక్షల బీమా చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశం లో చేనేత,జౌళి శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగలత, సహాయ సంచాలకులు బాబు, భిక్షప్ప, అభివృద్ధి అధికారి రాజేశ్ బాబు, సహాయ అభివృద్ధి అధికారులు లావణ్య పాల్గొన్నారు.