ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలి

గద్వాల, వెలుగు :  ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అడిషనల్  కలెక్టర్  అపూర్వ్  చౌహాన్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్  మీటింగ్ హాల్ లో సంబంధిత ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్  సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, మాస్ కాపీయింగ్​ జరగకుండా ఫ్లయింగ్, సిట్టింగ్  స్క్వాడ్ లను నియమించాలని సూచించారు.

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 3,664 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా, 9 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్డీవో రాంచందర్, డీఎస్పీ సత్యనారాయణ, డీఐఈవో హృదయరాజు, డిప్యూటీ డీఎంహెచ్​వో సిద్దప్ప 
పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ కలెక్టరేట్ :  సమన్వయంతో పని చేసి ఇంటర్​ సప్లిమెంటరీ పరీక్షలను పక్కాగా నిర్వహించాలని డీఆర్వో  కేవీవీ రవికుమార్  సూచించారు. కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలో 21 పరీక్ష కేంద్రాల్లో 6,585 ఫస్ట్​ ఇయర్, 3,719 మంది సెకండ్ ఇయర్  స్టూడెంట్లు పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. మొత్తం10,304 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. డీఐఈవో శ్రీధర్ సుమన్, డీఈసీ మెంబర్లు ఉమా మహేశ్వర్, రవీందర్  పాల్గొన్నారు.