సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది.. ఏఏజీ పొన్నవోలు

సీఎం జగన్ ఇటీవల కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా జరిగిన ఎన్నికల తర్వాత విశ్రాంతి కోసం జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు జగన్ పర్యటనపై హడావిడి చేశాయి. తాజాగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో జగన్ లండన్ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. జగన్ కు ప్రాణహాని ఉందని, జగన్ ను కాపాడుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందని అన్నారు. 

ఎన్నారైలతో జరిగిన సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు పొన్నవోలు.పొన్నవోలు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారటమే కాకుండా వైసీపీ శ్రేణులను టెన్షన్ పెడుతున్నాయి. జగన్ రాజకీయ ప్రత్యర్థుల కంటే శత్రువులే ఎక్కువ ఉన్నారన్న టాక్ కూడా ఉండటం, పైగా ఏపీలో ప్రతీకార రాజకీయాలు పీక్స్ చేరిన క్రమంలో పొన్నవోలు వ్యాఖ్యలు కీలకంగా మారాయి.