రైతులను దోచుకున్న చరిత్ర బీజేపీ, బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లదే: అద్దంకి దయాకర్ కౌంటర్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, బీజేపీ నాయకులు విమర్శలకు తప్ప.. దేనికి పనికిరారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారంలో ఉన్న సమయంలో రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారని ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.

ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. అన్ని పంటలకు బోనస్, రైతు బీమా, నష్ట పరిహారం ఇస్తూ.. రైతుల పట్ల సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డికి ఎలాంటి కమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉందో ప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిందన్నారు. రైతులను దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్, బీజేపీలదని మండిపడ్డారు. ఒకవైపు రాష్ట్ర ధనాన్ని కొల్లగొట్టిన దొంగలు, మరోవైపు రాష్ట్రానికి చిల్లిగవ్వ ఇవ్వని కేంద్ర ప్రభుత్వ దొంగలు మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. పదేండ్లలో రైతు రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.